UPDATED 20th MARCH 2022 SUNDAY 12:41 PM
Dasara: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘అంటే.. సుందరానికీ!’ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. లేట్ చేయకుండా ‘దసరా’ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాడు. గత సంవత్సరం దసరా రోజు ‘దసరా’ సినిమా అనౌన్స్ చేయడంతోనే ఇది కొత్తగా ఉండబోతుందని చెప్పేశారు.
నాని కెరీర్‌లో 29వ చిత్రంగా రాబోతున్న దసరా చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిగా నేచురల్ స్టార్ కనిపిస్తున్నాడు. తెలంగాణ గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ కథ సాగుతుందని సమాచారం. ఈ సారి నాని మరింత పూర్తి మాస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు సినిమాని తెరకెక్కిస్తున్నాడు.







