AP News: అవినీతిలో రెవెన్యూశాఖదే అగ్రస్థానం

అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: అవినీతిలో రెవెన్యూశాఖ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 2021 సంబంధించి వార్షిక నివేదికను అవినీతి నిరోధక శాఖ (అ.ని.శా) గురువారం విడుదల చేసింది. అనిశా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెవెన్యూ శాఖలో అవినీతికి సంబంధించి ఈ ఏడాది 36 కేసులు నమోదయ్యాయి. విద్యుత్‌ శాఖలో 6, ఆర్‌అండ్‌బీ 9, హోంశాఖ 6, మున్సిపల్‌శాఖలో 5, అక్రమాస్తుల కేసులు 12 నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 72 ట్రాప్‌ అవినీతి కేసులు ఉండగా, ఆకస్మిక తనిఖీల్లో 45 కేసులు, సాధారణ విచారణల్లో 26 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో అవినీతి నిరిధక శాఖ తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us