జిల్లాలో ఈ-చలానా విధానం ప్రారంభం

UPDATED 19th JULY 2017 WEDNESDAY 9:00 PM

కాకినాడ : జిల్లాలో ట్రాఫిక్‌ సేవలను మరింత పటిష్టం చేసేందుకు ఈ-చలానా విధానాన్ని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర  డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. బుధవారం కాకినాడలో ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని, దీనిద్వారా పలుచోట్ల పోలీసులపై వస్తున్న ఆరోపణలకు అడ్డుకట్టపడటంతో పాటు విధినిర్వహణలో పారదర్శకతకు అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు ఎన్ని సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించాడనే సమాచారంతో పాటు జరిమానా విధానం సరళీకృతం అవుతుందని, జరిమానా సొమ్ము డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుతో చెల్లించే అవకాశం ఈ విధానంలో లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ శాంతిభద్రతల విభాగం హరీష్‌కుమార్‌ గుప్త, ఉత్తర తీర ప్రాంత ఐజీ కుమార్‌ విశ్వజిత్‌, ఏలూరు రేంజి డీఐజీ పీవీఎస్‌ రామకృష్ణ, జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని, రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us