Total lunar eclipse: 8న చంద్ర‌ గ్ర‌హ‌ణం.. శ్రీ‌వారి ఆల‌యం మూసివేత: టీటీడీ

UPDATED 3rd NOVEMBER 2022 THURSDAY 4:10 PM

Total lunar eclipse: సూర్య గ్రహణం ఏర్పడిన కొన్ని రోజులకే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ నెల 8న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 8న శ్రీ‌వారి ఆల‌యం మూసివేస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ల జారీని ర‌ద్దు చేశారు. గ్ర‌హ‌ణ స‌మ‌యంలో అన్న‌ప్ర‌సాద వితరణ నిలిపివేస్తున్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో చంద్ర‌ గ్ర‌హ‌ణం రోజున 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తామని టీటీడీ తెలిపింది. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం-2 నుంచి మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారని టీటీడీ చెప్పింది. 8న మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుంచి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది.

ఉద‌యం 8.40 నుంచి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసివేస్తామని టీటీడీ వివరించింది. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ నిలిపివేస్తున్నట్లు చెప్పింది. రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుందని టీటీడీ వివరించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us