Crime News: కర్నూలులో విషం తాగి ఎస్‌ఐ ఆత్మహత్య

కర్నూలు (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రాఘవరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాఘవరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగానే ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇద్దరు కుమారులు వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us