మాతా, శిశు మరణాలు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 1st JULY 2017 SATURDAY 7:00 PM

కాకినాడ : రాష్ట్రంలో మాతా, శిశు మరణాలను తగ్గించటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘అన్న అమృతహస్తం’ పథకాన్ని స్థానిక ఏఎంజీ పాఠశాల ఆవరణలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి మాట్లాడుతూ గర్భిణులకు సరైన పౌష్టికాహారం లేకపోవటంతో పిల్లలు బలహీనంగా పుడుతున్నారన్నారు. గర్భిణులు, బాలింతలలో రక్తహీనత సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వీరికి పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుందని దీనిని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రారంభించనున్న పూర్వప్రాథమిక విద్యకు సంబంధించి బేసిక్‌ ఫౌండేషన్‌ పుస్తకాలను మంత్రి తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, ఐసీడీఎస్‌ పీడీ శారదాదేవి, నగరపాలక సంస్థ కమిషనర్‌ అలీంబాషా, సమాచారశాఖ డీడీ ఫ్రాన్సిస్‌, సీడీపీవో సావిత్రి, నగర టిడిపి అధ్యక్షుడు సుంకర తిరుమలకుమార్‌, సూపర్ బజార్ చైర్మన్ ఇఎ నాయుడు, జన్మభూమి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us