తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: తిరుమల రెండో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి రహదారిపై భారీ బండరాయి పడింది. దీంతో రహదారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. వెంటనే స్పందించిన తితిదే సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపేశారు. తాత్కాలికంగా రెండో ఘాట్‌రోడ్డును మూసేశారు.







