అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చురకలు అంటించారు. ప్రాణ త్యాగాలైనా చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘వైసీపీ ఎంపీలూ.. కనీసం ప్లకార్డులు పట్టుకోండి.. చాలు’ అని పవన్ అన్నారు. ప్రాణాలు తీసుకునేంత త్యాగాలు చేయక్కర్లేదని పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుంటే చాలని ఆయన ట్వీట్ చేశారు.







