YS Viveka Case : వైఎస్ వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

Updated 5th March 2023  Sunday 7:20 am

YS Viveka Case : వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది. మూడోసారి విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. సోమవారం (మార్చి6,2023)న మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

సీబీఐ అధికారులు శనివారం(మార్చి4,2023) రాత్రి పులివెందులలోని అవినాశ్ రెడ్డికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. అవినాశ్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం(మార్చి6,2023) ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో జరిగే విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. మార్చి10న హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ ఉండటంతో సీబీఐ విచారణలో వేగం పెంచింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us