బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి: వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు

కాకినాడ : 9 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక రమణయ్యపేట ఫిష్ మార్కెట్, కాకినాడ రూరల్ మండలంలో చేపల వర్తకులకు, కట్టర్లకు ఐస్ బాక్సులను మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే రమణయ్యపేట వద్ద ఉన్న చేపల మార్కెట్ ఇటీవలే రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగడం వలన మార్కెట్ లో ఉన్న మత్స్యకారుల ఐస్ బాక్సులు, టార్పాలిన్లు, అల్యూమినియం బేసిన్ లు మొదలైనవి కాలిపోయాయని, రమణయ్యపేట చేపల మార్కెట్ కాకినాడ రూరల్ మండలంలో ముఖ్యమైన పెద్ద మార్కెట్ అన్నారు. ఈ మార్కెట్ ద్వారా సుమారుగా 50 మంది చేపల వర్తకులు, చేపల కట్టర్లు ఉన్నారన్నారు. ప్రభుత్వం అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 50 మంది చేపల వర్తకులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు విలువ చేసే సీ ప్లాస్ట్ కంపెనీ తయారు చేసిన 100 లీటర్ల కెపాసిటీ కలిగిన ఐస్ బాక్సులను ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారుగా రూ. 2 లక్షల 50 వేల రూపాయలని మంత్రి కన్నబాబు తెలిపారు. అనంతరం డీసీఎమ్మెస్ చైర్మన్ దున్నా జనార్ధనరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జి దవులూరి దొరబాబు చేతుల మీదుగా చేపల వర్తకులకు ఐస్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడి పి. కోటేశ్వరరావు, ఏడి శ్రీనివాస్, ఎఫ్.డి.వో యం. లక్ష్మణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us