Munugode Poll 2022: మునుగోడులో ప్రజాశాంతి పార్టీదే గెలుపు.. TRS పార్టీకి రూ.15 కోట్లు ఇచ్చా: ​కేఏ పాల్‌

UPDATED 30th AUGUST 2022 TUESDAY 10:00 PM

KA Paul Munugodu poll 2022 : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక హీట్‌ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఈ క్రమంలో మునుగోడులో గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అమిత్‌ షా, సీఎం కేసీఆర్‌ మునుగోడులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇక కాంగ్రెస్‌ పార్టీ అయితే ఏకంగా లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో మునుగోడులో తమ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌. మునుగోడులో బీజేపీ కోమటిరెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదని తేల్చి చెప్పారు.uఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడుతూ.. ‘‘56 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ప్రజలను పట్టించుకోలేదు.. ఇక సొంత రాష్ట్రంలో కేసీఆర్‌ కూడా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదు. హామీలు విస్మరించడం, ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు పంచడం తప్ప కేసీఆర్‌కు ఇంకేమీ చేతకాదని’’ కేఏ పాల్‌ ఎద్దేవా చేశారు.

ప్రజలు తాయిలాలకు, ప్రలోభాలకు పొంగిపోకుండా.. తమ అభివృద్ధి గురించి పట్టించుకోని పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని కేఏ పాల్‌ పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లోనూ ప్రజాశాంతి పార్టీ కమిటీలున్నాయని.. గెలుపు తమదేనంటూ కేఏ పాల్‌ ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ పార్టీకి తాను రూ.15 కోట్లు ఇచ్చానని.. అందుకు కేసీఆర్‌ కుమార్తె కవిత, దిలీప్‌ కుమార్లే సాక్షమన్నారు కేఏ పాల్‌. బంగారు తెలంగాణను కేసీఆర్ దరిద్ర తెలంగాణగా మార్చారని పాల్ ఆరోపించారు. కేసీఆర్ చేసిన అవినీతి గురించి మాట్లాడితే తనను చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని.. కేసీఆర్, కేటీఆర్ రోడ్లపై తిరిగితే ప్రజలు తరిమి తరిమి కొడతారని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని కేఏ పాల్ అన్నారు. మునుగోడులో ఏ పార్టీ కూడా బీసీకి గానీ దళితులకు గానీ టికెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేఏ పాల్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us