UPDATED 13th OCTOBER 2022 THURSDAY 06:00 PM
▪️ స్వామివారిని దర్శించుకున్న గోవా గవర్నర్ శ్రీ పిఎస్.శ్రీధరన్ పిళ్లై
Venkateswara Vibhavotsavam Hyderabad : హైదరాబాద్‌లో టీటీడీ తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు.
గోవా గవర్నర్ పిఎస్.శ్రీధరన్ పిళ్లై స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సేవగా తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు.







