డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై నిరసన

UPDATED 18th MAY 2018 FRIDAY 8:00 PM

సామర్లకోట: స్థానిక జగ్గమ్మగారి పేటలో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ కంపోస్టు డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు శుక్రవారం మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ మున్సిపల్  కౌన్సిల్ సామర్లకోట మున్సిపల్ పరిధిలో కంపోస్టు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయడం విచిత్రంగా ఉందని, స్థానిక మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిరసన తీర్మానం ఆమోదించాలని, కాకినాడ కౌన్సిల్ చేసిన చట్ట విరుద్ధ తీర్మానాన్ని తక్షణం రద్దు పరచమని ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి సత్యన్నారాయణ, ఉప కార్యదర్శి బోడకొండ, వినియోగదారుల రక్షణ సంఘం కార్యదర్శి ప్రసాద్, మాజీ మున్సిపల్  చైర్మన్ గుణ్ణం రాజబ్బాయి, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, జనసేన నాయకులు సరోజ్ వాసు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కుంచే నానిబాబు, యార్లగడ్డ అక్కిరాజు, ఎలిశెట్టి రామదాసు, సేపేని సురేష్, మాజీ వైస్ చైర్మన్ గోలి వెంకటఅప్పారావు చౌదరి, మేకా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us