Somu veerraju: 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం-సోము వీర్రాజు

Updated 25 January 2022 Tuseday 06:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అధికారంలోకి రాగానే రాజధానిని మూడేళ్లలో నిర్మిస్తాం అని ఆయన చెప్పారు. మేము డిపాజిట్ల కోసం కాదు ఏపీ అభివృద్ధి కోరుకునే వాళ్లం అని వ్యాఖ్యానించారు.సంక్రాంతి ఎలా ఉంటుందో మంత్రి కొడాలి నానికి, సీఎం జగన్ కి తెలపాలనే గుడివాడ వెళ్లామన్నారు సోము వీర్రాజు.

వైసీపీ ప్రభుత్వానికి సంక్రాంతి అంటే తెలియదన్నారు. వైసీపీ వాళ్లు మతతత్వవాదులని సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీ.. మతాల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే చక్రపాణి.. శ్రీశైలంలో ముస్లింలతో వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపించారు. మేము జాతీయవాదులం అన్న సోము వీర్రాజు.. హిందుత్వాన్ని కాపాడేది బీజేపీనే అని తేల్చి చెప్పారు.మంత్రి కొడాలి నానికి మైండ్ పోయిందన్నారు సోము వీర్రాజు. మేం ఏ పార్టీతోనూ లేము అని స్పష్టం చేసిన సోము వీర్రాజు.. వైసీపీ వాళ్లు ఏ పార్టీతో ఉన్నారో వారే తేల్చుకోవాలన్నారు. ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్డుకునే వైసీపీ నేతలు.. మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీది రూలింగ్ కాదు ట్రేడింగ్ పార్టీ అని విమర్శలు చేశారు. చంద్రబాబు తోక పట్టుకుని వేలాడే పార్టీ మాది కాదన్న సోము వీర్రాజు.. మాపై విమర్శలు చేస్తే గట్టిగా బుద్ది చెబుతామని హెచ్చరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us