ఎంతైనా సోషల్ మీడియానా మజాకా...

* ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటిది చూడ‌లేదు: బ‌న్నీ
*  కుర్రకారుకు మత్తెక్కిస్తున్న మలయాళం సాంగ్.. వీడియో
*  సన్నీ లియోన్‌నే మించిన కేరళ కుట్టి
UPDATED 13th FEBRUARY 2018 TUESDAY 6:00 PM
ఓ 26 సెకండ్ల ఒక మల‌యాళం సాంగ్‌లోని జస్ట్ క్లిప్. కాని.. గత రెండు మూడు రోజులు నుంచి సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపుతున్నది. ఎంతలా అంటే.. కుర్రకారు కొన్ని వందలు, వేల సార్లు ఆ వీడియోను చూస్తూ.. ఆ వీడియోలో అమ్మాయి హావభావాలకు ముగ్ధులైపోతున్నారు. వాట్సాప్ స్టేటస్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఆ వీడియోనే. ఇక మరోవైపు ఆ వీడియోపై సెటైరికల్‌గా జోక్స్ వేస్తూ నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక ఈ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో కుర్రకారు మతులు పోగొట్టేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటు సామాన్యులే కాక అటు సెల‌బ్రిటీలు కూడా ఈ వీడియోలో అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్నారు. ఇది మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్‌'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్‌లోని క్లిప్ కాగా, ఈ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో కుర్రకారు మతులు పోగొడుతుంది. ప్ర‌తి ఒక్క‌రు ఈ వీడియోని షేర్ చేస్తూ త‌మ ల‌వ్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ప్రియా ప్రకాశ్ వారియర్ చూపుల‌కి పడిపోయాడు. వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో వీడియోని షేర్ చేస్తూ.. ఈ మ‌ధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియో చూడ‌లేదు. సింప్లిసిటీకి ఉన్న ప‌వ‌రే ఇది. నాకు బాగా న‌చ్చింది అంటూ కామెంట్ పెట్టాడు. మలయాళం సినిమా సాంగ్ మానిక్యా మలారాయ పూవి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఆ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 46 లక్షల మంది వీక్షించారు. మలయాళం హీరోయిన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కి అనూహ్యంగా ఇంత‌ పాపులారిటీ దక్కడంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతుంది. తనపై చూపించిన అభిమానానికి ఉప్పొంగిపోతుంది. తనకు దక్కిన విశేషాదరణపై ట్విటర్‌లో స్పందించింది. సోషల్‌ మీడియాలో తాను జాతీయస్థాయిలో స్టార్‌గా మారడాన్ని నమ్మలేకపోతున్నానని  ప్రియా ప్రకాశ్‌ ట్వీట్‌ చేసింది. తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది. 'ఓరు అదార్‌ లవ్‌' సినిమాతో వెండితెరకు ఆమె పరిచయమవుతోంది. ఈ సినిమా మార్చి 3న విడుదలకానుంది. ఈ మూవీలో నటిస్తున్నం‍దుకు చాలా సంతోషంగా ఉందని ప్రియ వ్యాఖ్యానించింది. రాత్రికి రాత్రే ఎవరూ సెలబ్రిటీలు కారని ఎవరన్నారు? ఒక్కసారి ప్రియా ప్రకాశ్ వారియర్ ను చూడండి. ఈ ఇంటర్నెట్ సెన్సేషన్ ఇచ్చిన ఒక్క స్మైల్.. కోట్ల మంది గుండెల్ని కొల్లగొట్టింది. సోషల్ మీడియా క్వీన్‌ను చేసేసింది. ఓరు అదార్ లవ్ మూవీలోని ఓ సాంగ్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా. అందులో ప్రియా ఎక్స్‌ప్రెషన్స్.. నెటిజన్లను మనసు దోచుకుంది. రాత్రికి రాత్రే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య ఆరున్నర లక్షలు పెరిగింది. తాజాగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌ను మించిపోయింది. గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్స్ లిస్ట్‌లో సన్నీని వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది ప్రియా ప్రకాశ్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగానే.. అసలు ఎవరీ ప్రియా అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్‌లో సన్నీని ప్రియా మించినట్లు తేలింది. ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పడుకొనే ఉన్నారు. 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా పెద్ద స్టార్ అయిపోయింది. అసలు ఈ రెస్పాన్స్ తాను ఊహించలేదని ఆమె అంటున్నది. ఎంతైనా సోషల్ మీడియానా మజాకా..
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us