UPDATED 26th OCTOBER 2022 WEDNESDAY 03:00 PM
Vizag airport ys jagan kodi kathi case : కోడి కత్తి కేసు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ పై జరిగిన దాడి. ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారంగా జగనే దాడి చేయించుకుని అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై నెట్టివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో కోడికత్తితో దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ గత నాలుగేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈక్రమంలో ఈ కోడి కత్తి కేసులో బెయిల్ కోసం ఎన్ ఓ సీ ఇవ్వాలని సీఎం జగన్ కు లేఖ ద్వారా కోరారు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్.
దీని కోసం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. జగన్ ను కలిసేందుకు శ్రీను కుటుంబ సభ్యులు లాయర్ సలీమ్ తో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కానీ జగన్ అపాయింట్ మెంట్ మాత్రం ఇవ్వలేదు. నాలుగేళ్ళుగా మా బిడ్డ రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతున్నాడని గోడు సిఎం చెప్పుకుంటామయని కోరారు. అయినా జగన్ మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో నిందితుడి కుటుంబ సభ్యులు సీఎం గ్రీవెన్స్ సెల్ లో వినతిపత్రం ఇచ్చి వెనుతిరిగారు. శ్రీను బెయిల్ కు నిరభ్యంతర సర్టిఫెకెంట్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు కుటుంబం సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. కానీ జగన్ ఇవ్వలేదు. దీంతో వారు సీఎం గ్రీవెన్స్ సెల్ లో వినతిపత్రం ఇచ్చి వెనుతిరిగారు.







