ముగిసిన మహిళా సంఘాల సిబ్బంది శిక్షణ

UPDATED 9th MAY 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో ఐదవ బ్యాచ్ మహిళా సంఘాల సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, మహిళల ఆరోగ్యం, మహిళా సాధికారిత, పిల్లల ఆరోగ్యం, బాల్య వివాహాలు అరికట్టడం వంటి తదితర అంశాలపై శిక్షణ నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ అధికారిణి పద్మజ్యోతి పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి బ్యాగులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు టి. కుమార్ రాజా, ఎస్.కె. మొహిద్దీన్, జె. రాంబాబు, శ్వేత, సుధీర్, రామ్మోహనరావు, మహిళా సంఘాల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us