గైట్ లో ముగిసిన వేసవి టెక్నికల్ ట్రైనింగ్

UPDATED 18th MAY 2018 FRIDAY 6:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల సిఎస్ఇ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన వేసవి టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగిసినట్లు కళాశాల సిఎస్ఇ విభాగాధిపతి డాక్టర్ బి. సుజాత తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ గైట్ క్యాంపస్ లోని కళాశాలల్లో సిఎస్ఇతో బిటెక్ తృతీయ, ఆఖరి సంవత్సరం చదువుతున్న రెండు వందల మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఉద్యోగాలు పొందడానికి అవసరమైన జావా, ఇంగ్లీష్ లో పట్టు సాధించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి తదితర అంశాలపై గత నెల 30వ తేదీ నుంచి ఈ రోజు వరకు శిక్షణ నిర్వహించామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు వరిస్తాయని, అందుకే యువత నైపుణ్యం పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కళాశాల సిఎస్ఇ డైరెక్టర్ డాక్టర్ టి.వి. ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లీలావతి, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us