PEDDAPURAM POLICE ACTION :బంగారం కొట్టేసే 'బ్యాగ్ లిఫ్టర్ల' ఆటకట్టు: పెద్దాపురం పోలీసుల అదుపులో ఇద్దరు ముఠా సభ్యులు

UPDATED 29th JULY 2026 9:00 PM

రూ. 20 లక్షల విలువైన 174 గ్రాముల స్వర్ణాభరణాలు స్వాధీనం

​సామర్లకోట, కాకినాడ బస్సుల్లో చోరీలకు పాల్పడిన నిందితులు

​పాండవుల మెట్ట సెంటర్ వద్ద ముమ్మర తనిఖీల్లో దొరికిన కేటుగాళ్లు

పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూలై 29 : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులే లక్ష్యంగా బంగారు ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులు కాజేస్తున్న ఇద్దరు నిందితుల (బ్యాగ్ లిఫ్టర్లు) ముఠాను కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 20 లక్షల విలువైన 174 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి..

​పెద్దాపురం SDPO తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం.. 2026 ఏప్రిల్ నెల 30వ తేదీన గోకవరం వెళ్లేందుకు సర్పవరం నుంచి సామర్లకోట వచ్చి బస్సు ఎక్కిన పి. లక్ష్మి అనే మహిళ హ్యాండ్ బ్యాగ్ నుంచి గుర్తుతెలియని దుండగులు 64 గ్రాముల నల్లపూసల దండ, నెక్లెస్ కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  

​అలాగే మే నెల 1 న విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్లే బస్సులో ఎం. రేఖ అనే ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 112 గ్రాముల బంగారు గాజులు, చైన్, ఉంగరం, చెవిలీలు, నల్లపూసల దండలు, ఉంగరం, చెవిలీలు,  చోరీ చేశారు. ఈ ఘటనపై కాకినాడ 2వ పట్టణ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో మరొక కేసు నమోదైంది.

రంగంలోకి ప్రత్యేక బృందాలు

​ఎటువంటి ఆధారాలు (క్లూస్) లభించని ఈ కేసులను సవాలుగా తీసుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ G. బిందు మాధవ్, ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. పెద్దాపురం SDPO ABG తిలక్ ఆధ్వర్యంలో పెద్దాపురం CI YRK శ్రీనివాస్, క్రైమ్ CI  R. అంకబాబు, SI U. పాపారావులతో పాటు క్రైమ్ సిబ్బంది బాలాజీ, రమణ, బాలబాలాజీలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

పాండవుల మెట్ట వద్ద అరెస్ట్

​పక్కా సమాచారంతో మంగళవారం (జూలై 28) పెద్దాపురం పాండవుల మెట్ట సెంటర్ వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన గుంజ గిడ్డన్న, తమ్మిశెట్టి వాణిలను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 20 లక్షల విలువ చేసే 174 గ్రాముల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us