సమగ్ర సమాచారంతో హాజరవ్వండి

UPDATED 6TH MAY 2017 SATURDAY 6:30 PM

కాకినాడ: సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ , కలెక్టర్ సమావేశాలకు హాజరయ్యే అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరంలో జరిగిన పనుల ప్రగతి, ఈ సంవత్సరంలో చేపడుతున్న పనుల నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడి, మండల సమాఖ్య, గ్రామ పంచాయతీ భవనాల పనులను స్లయిడ్, లొకేషన్ల వారిగా చూపించాలన్నారు. అలాగే ఉపాధి హామీ పధకంలో వేతనాల చెల్లింపు సకాలంలో చేయాలన్నారు. సంబంధిత పనులకు సంబంధించిన  ఏడు రిజిస్టర్లు నిర్వహించాలని లేకపోతే నిధులు రావని, రిజిస్టర్లు కొనుగోలుకు టెండర్లు పిలవాలన్నారు. ఈ నెల తొమ్మిదిన డ్వామా, నీరు ప్రగతి సంబందిత శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నందిని, జాయింట్ కలెక్టర్- 2  జె . రాధాకృష్ణమూర్తి , పంచాయతీ రాజ్ ఎస్ ఈ చిరంజీవి, డ్వామా పిడి నాగేశ్వరరావు, డీఆర్డీఏ పిడి మల్లిబాబు, వ్యవసాయ శాఖ జెడి ప్రసాద్, తదితర అధికారులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us