Updated 7th August 2023 Monday 6:50 pm
Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగష్టు 11న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే నాలుగు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
తాజాగా ఈ మూవీ నుంచి ‘కొట్టారా కొట్టు తీనుమారు’ అనే సాంగ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. మాస్ బీట్స్ తో సాంగ్ అదిరిపోయింది. ఇక ఈ పాటకి చిరుతో పాటు కీర్తి కూడా ఒక రేంజ్ స్టెప్పులు వేసినట్లు తెలుస్తుంది రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ చూస్తుంటే. ఈ పాటకి థియేటర్స్ లో జాతర కనిపించనుంది. ఈ పాటని పడగా, శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశాడు. కాగా ఈ మూవీ తమిళ్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుంది.







