UPDATED 15th MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: స్థానిక స్టేషన్ సెంటర్ లో వేంచేసివున్న నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు ఈ నెల 16 నుంచి నెల రోజులు పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జాతర సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలురకాల ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అలాగే ఉగాది రోజున ప్రముఖ పంచాంగకర్త చీమలకొండ వీరభద్ర ప్రసాదరావు పంచాంగ శ్రావణం ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.







