Updated 2nd April 2023 Sunday 5:10 am
Konaseema Thirumala: వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల వాడపల్లి మార్మోగింది. శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల నుంచి 80 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరువీధుల్లో ఏడు ప్రదక్షిలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కళాకారుల ప్రదర్శనలు, వేలాది మంది భక్తుల సమక్షంలో తిరువీధుల్లో రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రథోత్సవాన్ని ప్రారంభించారు. తీర్థంలో వినోదాత్మక ప్రదర్శనలతో యువత సందడి చేసింది. మెర్లపాలెం నుంచి వాడపల్లి వరకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తుల దాహార్తి తీర్చారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నసమారాధన చేశాయి. వివిధ డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు లు నడిపింది. కాగా కేరళ వాయిద్య కళాకారుల చండీమే ళం, కేరళ వేలప్పు నృత్యం, తమిళనాడు డ్రమ్స్, మహారాష్ట్ర ప్రత్యేక డ్రమ్స్ ఆకట్టుకున్నాయి. స్వామి, అమ్మవార్లను కల్యా ణ మండపానికి తోడ్కొని వెళ్లే సమయంలో భరతనాట్య కళాకారుల ప్రదర్శన అలరించింది. ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించగా వివిధ శాఖల అధికారులు ఉత్స వాల్లో తమ వంతు సేవలందించారు. అమరవీరుల స్తూపా నికి భక్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భావితరాలకు తెలియజేసేవిధంగా నివాళులు అర్పించారు.
అంగరంగ వైభవంగా కల్యాణం
వేద మంత్రాలు, మేళతాళ మంగళవాయిద్యాలు, మిరు మిట్లు గొలిపే బాణసంచా కాల్పులు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం శనివారం రాత్రి 8.30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్వామి, అమ్మవార్ల్లను ఎదుర్కోలు మండపం నుంచి శ్రీనివాసనగర్‌లో సర్వాంగసుందరంగా అలంకరించిన కల్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చి సింహాసనంపై ఆశీనులు గావించారు. వైఖానస ఆగమం ప్రకారం ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు విశ్వక్సేన పూల, రక్షా బంధ నం, మధుపర్క ప్రాసన, కన్యాదానం, మహదాశీర్వచనాల ను రమణీయంగా జరిపించారు. కల్యాణాన్ని వీక్షించిన భక్తు లు పునీతులయ్యారు. కల్యాణం జరుగుతున్న సమయంలో వందల కిలోలతో కర్పూర దీపాలు వెలిగించారు. కల్యాణ ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానం, పలు సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. మరోవైపు వాడపల్లి ఆలయ ప్రాం గణాన్ని వివిధ రకాల ఫల, పుష్పాలతో తీర్చిద్దారు. కోనసీమ తిరుమల వాడపల్లి డిజైన్ ఆకట్టుకుంది. ప్రాకార మండపాన్ని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పుష్పాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో శంఖు, చక్ర, నామాలతో ఫొటో షూట్ ఏర్పాటుచేశారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.24.75 లక్షలు వచ్చిందని ఈవో ముదునూరి సత్యనారాయణరాజు చెప్పారు. కాగా స్వామివారి కల్యాణోత్సవాన్ని వేలాదిమంది భక్తులు తిలకిం చి పరవశించిపోయారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి లావణ్య దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవదాయశాఖ రీజనల్ జాయింటు కమిషనర్ ఎంవీ సురేష్‌బాబు దంపతులు డీఎస్పీ కేవీ రమ ణ, రుడా చైర్మన్ షర్మిలారెడ్డి, ఆలయ చైర్మన్ రుద్రరాజు, రమేష్‌రాజు, ఉమాదేవి దంపతులు ఆలయ ఈవొ ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు, జడ్పీటీసీ బోణం సాయిబాబ, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు భక్తులు, దాతలు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి కల్యాణం జరుగుతుండగా బయట మిరిమిట్లు గొలిపే బాణాసంచా కాల్పులు భక్తులను ఆకట్టుకున్నాయి.







