కరువురహిత రాష్ట్రంగా ఎపి

UPDATED 3rd JUNE 2018 SUNDAY 7:30 PM

పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మరిడమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని నవనిర్మాణ దీక్ష, నీటిభద్రత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత రూ.16 వేల కోట్లు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి రూ. 54 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, నీటి ప్రాజెక్టులను నిర్మించి రైతాంగానికి పుష్కలంగా నీరు అందించే విధంగా నదులను అనుసంధానం చేస్తున్నామని , ఇందులో భాగంగానే పట్టిసీమ, పురుషోత్తపట్నం నీటి ప్రాజెక్టులు నిర్మించామని చెప్పారు. రైతాంగానికి సబ్సిడీలపై వ్యవసాయ పరికరాలు, బ్యాంకులు ద్వారా రుణ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఉధ్యానవనశాఖ ద్వారా పండ్ల తోటలు, పూలమొక్కలు పెంచుకోవడానికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తున్నామని, మెట్ట ప్రాంత రైతాంగానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. గోదావరిలో వేసవి సందర్బంగా నీరు లేనప్పటికి సీలేరు నీరు ద్వారా రైతాంగాన్ని ఆదుకున్నామని, 2019 నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు విడుదలకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. అన్ని వర్గాల వారికి కళ్యాణ మండపాలను నిర్మించడానికి చర్యలు చేపట్టామని,  నిరుపేదలైన వారి ఆడపిల్లలకు వివాహం నిమిత్తం చంద్రన్న పెళ్ళికానుక ద్వారా ఆర్థిక సహాయం అందచేస్తున్నామన్నారు. ఎన్.టి.ఆర్.  వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యసదుపాయం కల్పిస్తున్నామని, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కూడ ఆర్థిక సహకారం అంద చేస్తున్నామన్నారు. మత్యకారులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు ఆదాయం సమకూర్చేలాగ ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిపారు. పేద పిల్లల చదువులకు ఎల్.కె.జి. నుండి పి.జి వరకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు అవసరమైన అన్ని పనులను పూర్తి చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు పెద్దాపురం పట్టణంలో రైతు బజార్, బస్సు కాంప్లెక్స్ , డబల్ రోడ్డు, డ్రైన్లు, సిసిరోడ్లు, కమ్యూనిటీ భవనాలు, పింఛన్లు, రేషన్ కార్డులు అందచేయడం జరిగిందని,  ఇంకా మిగిలిన పనులను ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలో ఉన్న రెండు చెఱువులను అభివృద్ది పరుస్తున్నామని, వ్యక్తిగత మరుగుదొడ్లు నూరుశాతం పూర్తి చేశామని చెప్పారు. పట్టణంలో అందరికి ఇళ్ళు పథకం ద్వారా మొదటి విడతగా 1754 మందికి ఇళ్శులేని నిరుపేదలకు ఇళ్ళును అందచేస్తున్నామని, రెండవ విడతగా 1600 ఇళ్ళు మంజూరు అయ్యాయని, వాటిని కూడ అందచేస్తామని చెప్పారు. సాధికారమిత్ర ద్వారా 30 కుటుంబాలను కేటాయించి వారికి సంక్షేమ పథకాలు అందేలాగ చర్యలు చేపట్టామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ. 620 కోట్లు విలువైన  అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. అన్ని వార్డుల్లోను 85 శాతం అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన 15 శాతం పనులు సంవత్సరాంతానికి పూర్తి చేస్తామని తెలిపారు. అందరికి ఇళ్ళును జూన్, జూలై నాటికి లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందని అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కర్ మాట్లాడుతూ పట్టణంలో పశువులకు నీరులేక ఇబ్బందిగా ఉందని, గతంలో మున్సిపల్ చైర్మన్ మూడు  నీటి తొట్టెలను ఏర్పాటు చేశారని, అవి ప్రస్తుతానికి సరిపోవడం లేదని, మరికొన్ని నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని గ్రామసభలో మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు నీటిపారుదల శాఖ ఎస్.ఇ కృష్ణారావు నీరు, భద్రత, కరువు రహిత రాష్ట్రం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అందరికీ ఇళ్ళు సంబందించిన మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు ఈ సభలో అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో  వి. విశ్వేశ్వరరావు, నవనిర్మాణ దీక్ష ప్రత్యేక అధికారి బి.కె. మల్లిఖార్జునరావు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, సామర్లకోట, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లు అడబాల కుమారస్వామి, బొడ్డు బంగారుబాబు, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంది సత్యనారాయణ, తూతికరాజు, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us