సతీష్ బాబు సేవలు మరువలేనివి

UPDATED 18th NOVEMBER 2017 SATURDAY 6:30 PM

పెద్దాపురం: పాత్రికేయుడుగా బందిలి సతీష్ బాబు అందించిన సేవలు మరువలేనివని పలువురు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక ఎంపిడివో కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు అలమండ రంగనాథస్వామి అధ్యక్షతన సతీష్ బాబు సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. ముందుగా సతీష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సతీష్ బాబు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజంలో మంచి విలేఖరిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు చల్లా విశ్వనాథం, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎస్.కె. మున్నీ, డివిజన్ కార్యదర్శి పి. రాజీవ్, నియోజకవర్గ కార్యదర్శి కరెడ్ల రాజా, కె.సురేంద్రబాబు, మొల్లి సూర్యనారాయణ, రామ్ లక్ష్మణ్, టి.జె. ఆనంద్, సిద్ధు, తదితరులు పాల్గొన్నారు.      
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us