అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు ఐదేళ్లు పాలించడానికి అధికారం ఇచ్చారని, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తోందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పీఆర్‌సీ ఇచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.







