UPDATED 2nd JULY 2017 SUNDAY 3:00 PM
పెద్దాపురం : సామాజిక సేవలో మన పెద్దాపురం ఫేస్ బుక్ టీం మరో ముందడుగు వేసింది. బీద,ధనిక తారతమ్యాలను చేరిపేసేందుకు ఆ దిశగా వారు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పెద్దాపురం పట్టణంలో మన పెద్దాపురం గ్రూప్ బుచ్చి సీతయమ్మ "సమానవత్వపుగోడ" అనే అంశంతో వినూత్నంగా ఆలోచించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పేద, ధనికుల మధ్య తారతమ్యాన్ని చెరిపేసి అందరూ సమానమని తెలియచేయడమే ఈ బుచ్చి సీతయమ్మ సమానవత్వపు గోడ అని బృంద సభ్యులు పేర్కొంటున్నారు. మనకు అవసరం లేనివి ఇక్కడ వదిలి కావాల్సినవి తీసుకొని..మీకు అవసరం లేని బట్టలు, చెప్పులు, పుస్తకాలు, పెన్నులు ఇక్కడ ఉంచి వెళ్ళండి అని ఒక ప్రత్యేక ప్రదేశాన్ని నిర్ణయించారు. ఆ ప్రదేశంలో వస్తువులు అవసరమైన వారు తీసుకుని వెళతారు. ఇదే ఈ బుచ్చిసీతయమ్మ సమానవత్వపు గోడ అని బృంద సభ్యులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఏడీబి) బ్రాంచ్ కు ఆనుకుని ఉన్న గోడని ఈ రోజు మన పెద్దాపురం గ్రూప్ సభ్యులు క్లీన్ చేశారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు పెదిరెడ్డి నరేష్, బృంద సభ్యులు పాల్గొన్నారు.







