నెయ్యితో లాభాలెన్నో..!

UPDATED 24Tth MAY 2017 WENESDAY 7:00 AM

REDBEENEWS : నెయ్యితో కొవ్వు పెరుగుతుంద‌ని, మంచిది కాద‌ని మ‌నం అనుకుంటాం. కానీ వంట విష‌యానికి వ‌స్తే నూనె కన్నా నెయ్యి ఎంతో మంచిద‌ని తేలింది. వంట‌లో నెయ్యి వాడ‌కాన్ని ఎక్కువ చేయాలంటూ కొన్ని కార‌ణాల‌ను ఓ తాజా నివేదిక బ‌య‌ట‌పెట్టింది. అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌ల్లో వేడి చేసిన‌పుడు నూనె విష‌పూరిత‌మ‌వుతుంది. నెయ్యి మాత్రం చాలా తక్కువ మోతాదులో విష ప‌దార్థాల‌ను విడుద‌ల చేస్తుంది. నెయ్యితో పోలిస్తే సోయాబీన్‌ను 160 డిగ్రీల సెంటీగ్రేడ్ ద‌గ్గ‌ర వేడి చేసిన‌పుడు ప‌ది రెట్లు ఎక్కువ విష ప‌దార్థాల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు తేలింది. నూనెతో పోలిస్తే నెయ్యి స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువ‌. దీనివ‌ల్ల అది మండ‌టం కానీ.. చిన్న‌చిన్న అణువుల రూపంలో విడిపోవ‌డం కానీ జ‌ర‌గ‌దు. ఈ అణువుల వ‌ల్ల మ‌న శ‌రీరంలోని క‌ణాలు దెబ్బ‌తింటాయి. నెయ్యితో చేసిన‌వాటిని ఫ్రిజ్ లో ఉంచాల్సిన ప‌నిలేదు. రూమ్ టెంప‌రేచ‌ర్ ద‌గ్గ‌రే కొన్ని వారాల పాటు ఉంచ‌వచ్చు. అందులోని పాల ప‌దార్థాల‌ను తొల‌గించి ఉన్నందున అది అంత సుల‌భంగా పాడ‌వ‌దు. నెయ్యిలో బరువు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌య్యే కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ పాళ్లు ఎక్కువ‌గా ఉంటాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us