UPDATED 19th JUNE 2017 MONDAY 7:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బిబిఎ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తరగతులు ప్రారంభమైనట్లు సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిబిఎ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల విశిష్టతలు, తమ విద్యా సంస్థ అందించే సౌకర్యాలపై వివరించారు. మంచి ప్రావీణ్యం నైపుణ్యత గల విద్యార్థులు ఈ కోర్సులు పూర్తి చేసిన తరువాత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఒక సంస్థను స్థాపించి పది మందికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేయాలన్నారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సుధీర్ పాండ్రా మాట్లాడుతూ పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాదని నిరంతరం కృషి, పట్టుదల వల్ల గొప్పవారిగా ఇతరులకు మార్గదర్శకులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.







