Minister KTR : నల్లగొండకు రూ.18 వేల కోట్లు ఇస్తే.. పోటీ నుంచి తప్పుకుంటాం : మంత్రి కేటీఆర్‌

UPDATED 12th OCTOBER 2022 WEDNESDAY 02:00 PM

Minister KTR : నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్‌ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు… నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ్యమని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

‘‘ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు. మరో వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు. గుజరాత్‌కు గత ఐదు నెలల్లో రూ.80 వేల కోట్ల ప్యాకేజీలు. తెలంగాణకు కనీసం రూ.18వేల కోట్లు ఇవ్వలేరా..? నీతి ఆయోగ్‌ ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం మిషన్‌ భగీరథకి రూ.19వేల కోట్లు కేటాయించామని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు.

రాజకీయ ప్రయోజనం కోసం ఓ వ్యక్తికి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. మోడీ గారూ ఇప్పటికైనా నల్లగొండ జిల్లాకు రూ.18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా..?’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us