F3 Movie : హాట్ సమ్మర్‌లో కూల్ ఫన్.. ‘ఎఫ్ 3’ వచ్చేస్తోంది..

F3 Movie: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, హాట్ బ్యూటీ మెహ్రీన్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘ఎఫ్ 2’.. 2019 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం..ఫన్‌ అండ్ ఫ్రస్టేషన్‌ అంటూ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా.. మోర్ ఫన్‌తో ‘ఎఫ్ 3’ రాబోతుంది.

2020 డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. పాండమిక్ వల్ల ఆలస్యమయింది. 2022 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ అప్పటికే పెద్ద సినిమాలుండడంతో ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు.

సోమవారం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 28న ‘ఎఫ్ 3’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఒక్క సాంగ్ మినహా షూటింగ్ కంప్లీట్ అయింది. సునీల్, సోనాల్ చౌహాన్, రఘుబాబు, తులసి తదితరులు నటించిన ‘ఎఫ్ 3’ లో, ‘ఎఫ్ 2’ కి మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని చెప్తున్నారు మూవీ టీం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us