ఆదిత్య విద్యార్థులకు జె.ఎన్.టి.యు.కె బంగారు పతకాలు

UPDATED 25th JANUARY 2018 THURSDAY 5:00 PM

గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పెట్రోలియం టెక్నాలజీ విద్యార్థులు కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి బంగారు పతకాలు పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన పి. బాల దుర్గా ప్రసాద్ (ఆదిత్య), ముఖరం మల్లిక్ (ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్) విద్యార్థులు ఇంజనీరింగ్ లో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభకు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నారని ఆయన తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తదితరులు విద్యార్థులను అభినందించారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us