ప్రపంచాన్ని మార్చేశక్తి విద్యకే ఉంది

UPDATED 26th JUNE 2017 MONDAY 9:00 PM

తొండంగి : ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ లక్ష్మణుడుపేటలో సోమవారం డిగ్రీ కళాశాల తాత్కాలిక భవానాన్నిమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుని మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ యనమల కృష్ణుడు అధ్యక్షత నిర్వహించిన బహిరంగ సమావేశంలో మంత్రి  మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నివిధాలా కృషి చేస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు రూ.23,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు విద్యకు 10 శాతం నిధులు కేటాయించగా, విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం ఆ మొత్తాన్ని15 శాతానికి పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యను బలొపేతం చేయాలనే ఉద్ధేశంతో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ విద్యార్థుల శాతం తగ్గుతోందన్నారు. అనంతరం ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ త్వరలో డిగ్రీ కళాశాల శాశ్వత భవనానికి స్థల సేకరణ చేసి నిర్మాణం ప్రారంభిస్తామని, కొంత కాలంగా రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలకు మంజూరు లేదని, ముఖ్యమంత్రి చొరవతో కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు.ఈ  కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు యడ్ల భేతాళుడు, యనమల రాజేష్, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌-2 రాధాకృష్ణమూర్తి, తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు, తాండవ సుగర్స్ చైర్మన్ సుర్ల లోవరాజు, డిసిసిబి ప్రెసిడెంట్ వరుపుల రాజా, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us