ట్రాన్స్ జెండర్లకు పింఛన్లు పంపిణీ

UPDATED 9th APRIL 2018 MONDAY 6:00 PM

కాకినాడ: జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు ప్రతీ నెల రూ.1500 పింఛన్ చెల్లించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. స్థానిక కలక్టరేట్ కోర్టు హాలులో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 23 మంది ట్రాన్స్ జెండర్లకు ఆయన చేతులమీదుగా ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు ఈనెలలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి అర్హులైన వారికి వైద్య ధృవపత్రాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య ధృవపత్రాలు పొందాలని, ఈ ధ్రువపత్రం పొందిన ప్రతీ ఒక్కరికి ప్రతి నెల రూ.1500 చొప్పున ఫించన్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ. మల్లిఖార్జున, డి.ఆర్.డి.ఎ. పిడి ఎస్. మల్లిబాబు, ఐసిడిఎస్ పిడి సీతామహాలక్ష్మి, డ్వామా పిడి రాజకుమారి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి ఇ. వసంతలక్ష్మి, మహిళా అధికారులు, డి.ఆర్.డి.హెచ్ ఎపివో ఎం. సోమేశ్వరరావు, పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us