ఎల్&టికి ఎంపికైన ఆదిత్య విద్యార్థులు

UPDATED 2nd DECEMBER 2017 SATURDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల విద్యారులు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ లో విశేష ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ సంస్థ ఎల్&టి టెక్నాలజీస్ గత నెల 27న శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ లో మెకానికల్ విభాగంలో ఐదుగురు, ఇసిఇ విభాగం నుంచి ఒక విద్యార్థి ఎంపికయ్యారని, వీరికి వార్షిక వేతనంగా రూ. 2.80 లక్షలు లభిస్తుందన్నారు. తమ సంస్థ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా ప్లేస్మెంట్ విభాగంచే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఎల్&టి టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థకు తమ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఎంపికైన విద్యార్థులను క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, తదితరులు అభినందించారు.                

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us