Back Door: బ్యాక్‌డోర్‌.. విడుదల ఖరారు

రెడ్ బీ న్యూస్,13 డిసెంబర్ 2021: పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్‌’. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాత. ప్రణవ్‌ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్‌ 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు. ఈ చిత్రానికి కూర్పు: చోటా కె.ప్రసాద్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us