విలేజ్ మాల్స్ గా రేషన్ షాపులు

UPDATED 20th AUGUST 2017 SUNDAY 10:00 PM

కరప: పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపంపిణీ వ్యవస్థలోని రేషన్ షాపులను విలేజ్ మాల్స్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేళంగిలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్ ను ఆదివారం ఆకస్మికగా తనిఖీ చేశారు. గోడౌన్ లో ఉన్న బియ్యం, పంచదార, కందిపప్పుల రికార్డులను, సరకుల నాణ్యత, నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి కడుపునిండా అన్నం పెట్టడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అన్న అమృత హస్తం పథకాలకు ఇక నుంచి సోనామసూరి రకం బియ్యాన్ని సరఫరా చేసేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇటీవల గుంటూరులో రేషన్ షాపుల్లో సరఫరా చేస్తున్న సరకుల్లో నాణ్యత లేనట్లు వస్తున్న ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ప్రజలకు నాణ్యతతో కూడిన సరకులు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. మార్కెట్‌లో నిత్యావసరాల ధరల అదుపునకు నాణ్యమైన సరకులను రేషన్ షాపుల ద్వారా ప్రజలకు విక్రయించడానికి విలేజ్ మాల్స్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. డీలర్ల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అలాగే రాష్ట్రంలో ఉన్న 29వేల మంది డీలర్లకు ఆదాయం పెంచేలా చేయడంతో పాటు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బహిరంగ మార్కెట్‌ కంటే 20శాతం తక్కువ ధరకు నిత్యావసర సరకులను విక్రయించేలా పౌర సరఫరాల శాఖ ప్రణాళిక రూపొందించిందన్నారు. నాణ్యత లేకపోయినా, తక్కువ తూకం వచ్చినా గోడౌన్ నుంచి సరకులు తీసుకోవద్దని, రేషన్‌ షాపుల్లో ప్రజలకు తూకాల్లో తేడా వస్తే డీలర్లదే బాధ్యతని అన్నారు. రేషన్‌ దుకాణాల వద్ద నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి కాదని, వినియోగదారుల ఇష్టం మేరకు సరకులను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో వి.రవికిరణ్‌, తదితర అధికారులు  పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us