పెద్దాపురం : రాష్ట్రాభివృద్ధి కోరుతూ పెద్దాపురం పట్టణంలోస్థానిక మిరపకాయల వీధి రామాలయం వద్ద టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా పదవవార్డు కౌన్సిలర్ త్సలికి సత్య భాస్కరావు ఆద్వర్యం లో నిర్వహించిన పూజా కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు హాజరయ్యారు. బాలాంజనేయస్వామి వారికి నూటొక్క కొబ్బరికాయలు తో అభిషేకించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా కొలువు తీరిన మంత్రివర్గంతో రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా దూసుకు పోతుందన్నారు. అలాగే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బోడ్డు బంగారుబాబు, కందుల శ్రీనివాస్,గువ్వల త్రిమూర్తులు, కె.శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షుడు గోలి అమ్మన్నచౌదరి, పొసపల్లి వెంకట్రావు, తీగిరెడ్డి కోటి, బోండా వెంకట రమణ అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.







