పక్షిరాజంపై పరంధాముడు

ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 29 అక్టోబర్ 2021: కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గరుడోత్సవం కనులపండువగా జరిగింది. మలయప్పస్వామి మకరకంఠి, లక్ష్మీహారం వంటి ఆభరణాలు ధరించి గరుత్మంతుడిపై దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు ఆశీస్సులు అందించారు. స్వామి సేవలన్నింటిలోనూ గరుడసేవ అత్యంత ప్రాధాన్యమైంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాసు ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెబుతారు. పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో అర్చకస్వాములు రమణీయంగా నిర్వహించారు. కలెక్టర్‌ హరి కిరణ్‌, విప్‌ జగ్గిరెడ్డి, ఆలయ ఛైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సత్యనారాయణరాజు పట్టువస్త్రాలు సమర్పించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us