జంగారెడ్డిగూడెం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు వాగులో పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జల్లేరు వాగుపై ఉన్న వంతెనకు రెయిలింగ్ లేకపోవడంతోనే బస్సు వాగులో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జల్లేరు వాగుపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీకొని బస్సు వాగులో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులను స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఘటనాస్థలిలో ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.







