హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి

UPDATED 14th JUNE 2017 WEDNESDAY 6:00 PM

జగ్గంపేట: హిందూ ధర్మ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానంద పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నదీ ఒడ్డున నిర్మించిన పంచాలయాల  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. హిందూమత వ్యాప్తికి ప్రతీ ఒక్కరూ కృషి చేయడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుని భావితరాలకు అందించాలన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నవీన్ కుమార్  ఆధ్వర్యంలో వేదపండితులు స్వరూపానంద స్వామికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం, గుడా చైర్మన్ గన్నికృష్ణ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, స్వామీ స్వరూపానంద దివ్య ఆశీస్సులను పొందారు. అనంతరం గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ఎస్.వి.ఎస్.అప్పలరాజు, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కొత్త కొండబాబు, వైస్ ఎంపిపి మారిశెట్టి భద్రం, కొత్త భైరవ కృష్ణ, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు , అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us