Yashoda: ఓటీటీని లాక్ చేసుకున్న యశోద.. అప్పుడేనా అంటోన్న ఫ్యాన్స్!

UPDATED 12th NOVEMBER 2022 SUNDAY 8:10 AM

Yashoda: స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. చాలా రోజుల తరువాత సమంత తెలుగులో స్ట్రెయిట్ ఫిలింతో వస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక సినిమాను దర్శక ద్వయం హరి, హరీష్‌లు తెరకెక్కించగా పూర్తి థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో దిగిపోయింది.

అయితే ఈ సినిమాకు తొలిరోజే మంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ సినిమా మున్ముందు ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే యశోద సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసిందట.

ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై మాత్రం ఇప్పట్లో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేట్రికల్ రన్ ముగిసిన తరువాతే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం చేస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా, శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us