Nellore: ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ థియేటర్‌.. మూసివేత!

నెల్లూరు (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్‌ ధరలతో థియేటర్లు నడపలేమని వాటి యజమానులు ప్రకటిస్తున్నారు. స్వచ్ఛందంగా థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సినిమా హాళ్ల బయట బోర్డులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు నగరం.. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై ఉన్న వి-ఎపిక్‌ థియేటర్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ కలిగిన ఈ థియేటర్‌లో సినిమాని ఎంజాయ్‌ చేసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, జీవో నెం:35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని.. అందువల్ల థియేటర్‌ని కొన్నిరోజులపాటు మూసివేస్తున్నామని శనివారం ఉదయం యాజమాన్యం తెలిపింది. దీంతో థియేటర్‌కు వచ్చిన సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us