SHOCKING: చాకుతో హల్‌చల్ చేసిన ఉన్మాది.. కాళ్ళు, చేతులు కట్టేసి నడిరోడ్డుపై పడేసిన స్థానికులు

UPDATED 10th JUNE 2026 3:00 PM

​సామర్లకోట, రెడ్ బీ న్యూస్, జూన్ 10 : కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో ఓ వ్యక్తి చాకుతో వీరంగం సృష్టించడం తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై వెళ్తున్న ఒక జంటపై సదరు వ్యక్తి ఒక్కసారిగా చాకుతో దాడికి యత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

​పోలీసులకు అప్పగించాల్సింది పోయి..

అయితే, దాడికి యత్నించిన వ్యక్తిని గమనించిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా, అతడి కాళ్ళు, చేతులు తాడుతో కట్టేశారు. అనంతరం అతడి టీ-షర్టు విప్పేసి, మండుతున్న ఎండలో కాలుతున్న తారు రోడ్డుపై పడుకోబెట్టారు.

​స్థానికుల తీరుపై విమర్శలు:

సదరు వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తిస్తే.. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సింది పోయి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్థానికులు కూడా అలాగే ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండుటెండలో రోడ్డుపై అలా పడేయడం అమానుషమని, బాధ్యతారాహిత్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us