AP News: తనిఖీల పేరిట వ్యవస్థలు కుంగిపోయేలా చేస్తున్నారు: జీవీఎల్

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: అధికారంతో వ్యస్థలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు వైకాపా యత్నిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. ఇప్పటికే పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారని.. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా భయపెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం సినిమా థియేటర్లపై పడ్డారని జీవీఎల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తనిఖీల పేరిట వ్యవస్థలను కుంగిపోయేలా చేస్తున్నారని జీవీఎల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us