కిట్స్ విద్యార్థుల అద్భుత సృష్టి

Updated 25th April 2017 Tuesday 4:00 PM

పెద్దాపురం: వ్యవసాయ రంగానికి విజ్ఞానం జోడించి వ్యవసాయ యాంత్రీకరణకు కిట్స్ ఇంజనీరింగ్  విద్యార్థులు కృషి చేయడం అభినందనీయమని కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అన్నారు. కళాశాల ప్రాంగణంలో అగ్రికల్చర్ ఫోర్త్ ఇయర్ (అగ్రి బిటెక్) విద్యార్థులు హామీదుల్లా బాషా, మస్తాన్ షరీఫ్, స్వర్ణతేజ్, నీలారాణి రూపొందించిన చిన్నతరహా చెరుకు కోత యంత్రాన్ని చైర్మన్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయరంగంలోయాంత్రీకరణ జరగడం వల్ల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. రైతాంగానికి ఉపయుక్తమైన యంత్రాన్ని తయారు చేసిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం గైడ్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ కోత యంత్రాన్ని తయారుచేయడానికి టీవీఎస్ ఎక్సెల్ పాత ఇంజిన్, రెండు కట్టర్లు, రెండు ఫ్యాన్ కట్టర్లు, ఎనిమిది బేరింగులు, నాలుగు బేవల్ గేర్లు , పెట్రోల్ ట్యాంక్ వినియోగించారు. దీంతో ఒక హెక్టార్ చెరుకు పంటను పద్నాలుగు గంటల్లో కోత కోయవచ్చని, ఒక వ్యక్తి సులభంగా వినియోగించేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. దీని తయారీకి కేవలం రూ. 22 వేలు ఖర్చయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యంత్రం వినియోగం వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని, దీన్ని పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి త్వరలో తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఏవో కెఆర్ సందీప్, ఈ వొ జెన్నిబాబు,  ఏసీవో పెదకాపు తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us