తిరుమల (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : ఈనెల 13 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం జరగనుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అనుమతి లభించనుంది. నేటి నుంచి 14 వరకు గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ను రద్దు చేయనున్నారు. ఎల్లుండి నుంచి 22 వరకు సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.







