TS News: నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంపుతున్న ముఠా అరెస్టు

వరంగల్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021‌: నకిలీ ధ్రువపత్రాలను తయారు చేస్తున్న 12 మంది సభ్యులు గల ముఠా పట్టుబడింది. దేశంలోని వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంపుతున్న 9మందిని వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌పోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మీడియా సమావేశంలో వెల్లడించారు. వీరి నుంచి 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్‌టాప్‌లు, 1 ఐపాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ఫ్రింటర్ కలర్స్ బాటిల్స్,లామినేషన్ మిషన్, 12 సెల్ ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు దార అరుణ్, ఆకుల రవి అవినాష్, మామిడి శ్రీకాంత్‌, అరందుల మహేశ్‌, మీర్జా అక్తర్‌ అలీ బేగ్, మాదిశెట్టి సచిన్, చిదాల సలోనీ అలియాస్‌ రాధ, పోగుల సుధాకర్‌రెడ్డి, మామిడి స్వాతిలను అరెస్టు చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us