దూరప్రాంత బస్సులకు 60 రోజుల ముందే రిజర్వేషన్

అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021:: దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ఇకపై 60 రోజులకు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సదుపాయం 30 రోజుల ముందు వరకే ఉండేది. దీన్ని పెంచుతూ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. వరుస పండగలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు అన్నింట్లోనూ ఈ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. కొవిడ్‌తో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల వారసుల్లో అర్హత కలిగిన 97 మందిని జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించాలంటూ ఈడీ (పరిపాలన) కోటేశ్వరరావు బుధవారం ఆదేశాలు జారీచేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us