Updated 23 January 2022 Sunday 10:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): సీఎం జగన్ పాలనలో దళితులు, మహిళలకు రక్షణ లేదన్నారు నారా లోకేశ్. ఇదే విషయం చిత్తూరు జైలు సూపరిండెంట్ ఇంట్లో చోరీ కేసులో మరోసారి స్పష్టమైందని చెప్పారు. ఈ కేసు విచారణలో పోలీసులు తీరు దారణమన్నారు. పని మనిషి ఉమామహేశ్వరిపై అన్యాయంగా చోరీ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను నిర్బంధించడంతో పాటు స్టేషన్‌లోనే చితకబాదారన్నారు. దళిత మహిళను హింసించిన పోలీసుల్ని తక్షణమే అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ, మహిళ కమిషన్లు సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు.







